WNP: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, వనపర్తి డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి గురువారం సందర్శించారు. తరగతి గదులు, ల్యాబ్లు, వసతులను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించి, వైద్య విద్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.