KMR: ‘అరైవ్ అలైవ్’ రోడ్ సేఫ్టీ కార్యక్రమం 4వ రోజు గాంధారిలో గురువారం నిర్వహించారు. ఎస్పీ రాజేశ్ చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనాలు నడిపితే ప్రమాదాలు తగ్గుతాయన్నారు. అనంతరం ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు.