JN: కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. లింగాల ఘనపూర్ మండలం ముఖ్యనేతల సమావేశంలో రాజయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు తిరిగి కోరుకుంటున్నారని అన్నారు.