ATP: గుత్తి బీసీ కాలనీలో రోడ్డు మధ్యలో విద్యుత్ స్తంభం ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలోకి ఏ వాహనాలు రావాలన్నా ఈ విద్యుత్ స్తంభం వల్ల ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు పేర్కొన్నారు. విద్యుత్ అధికారులు స్పందించి రోడ్డు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని తొలగించి మరోచోట నూతన విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు.