W.G: తణుకులో వేంచేసిన కపర్దేశ్వర స్వామి వారిని ప్రముఖ చిత్ర సంగీత దర్శకుడు, గాయకుడు తమన్ ఆదివారం దర్శించుకున్నారు. తణుకులో ప్రసిద్ధిగాంచిన కపర్దేశ్వర స్వామి వారికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఎంతో ప్రాచుర్యం కలిగిన దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందాన్ని కలిగించిందని ఆయన అన్నారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన తణుకు పట్టణానికి రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.