NLG: చిట్యాలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. ఏనుగు నరసింహారెడ్డికి ఐఏఎస్ హోదా లభించిన సందర్భంగా.. ప్రమోద సాహితీ సంస్థ మిత్రులు కలిసి ఇవాళ ఘనంగా పౌర సన్మానం నిర్వహించారు. విశ్రాంత న్యాయమూర్తి కుకుడాల లక్ష్మణ్ ముఖ్యఅతిథిగా పాల్గొని, నరసింహారెడ్డి కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కుకుడాల గోవర్ధన్, సాహితి వేత్తలు పాల్గొన్నారు.