SKLM: టీడీపీ నిర్వహిస్తున్న ‘మహానాడు’కు విజయనగరం పార్లమెంట్ పరిధిలోని ఎచ్చెర్ల వేదిక కానుంది. మే 27 నుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆదివారం స్థల పరిశీలన చేసింది. పైడిభీమవరం, నెలివాడ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ప్రాంతాలను నేతలు పరిశీలించారు.