MBNR: జడ్చర్ల మండలంలోని చిన్న ఆదిరాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును ఆదివారం స్థానిక ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజలకు గృహ వసతి కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.