NDL: ఆళ్లగడ్డ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యాతం బాల చెన్నయ్య (65) వడదెబ్బతో ఆదివారం మరణించాడు. గ్రామంలోని మామిడి తోటలో ఆయన కూలీగా పనిచేస్తూ జీవనం సాగించే వాడు. ఆదివారం పనులు చేసుకుని ఇంటికి వస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.