KRNL: హొలగుంద మండలం ముద్దటమాగిలో శ్రీ గోపాలకృష్ణస్వామి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా గోవింద్ గౌడ్, రాజేంద్ర గౌడ్ కలిసి రూ.1,00,011 విరాళం అందించారు. వారి సేవాభావాన్ని గ్రామస్థులు అభినందించారు. ఆలయ నిర్మాణం అందరి సహకారంతో త్వరగా పూర్తవుతుందని గోవింద్ గౌడ్ ఆదివారం తెలిపారు. ఈనెల 23న జరిగే మహోత్సవానికి గ్రామస్థులు ఆయనను ఆహ్వానించారు.