ELR: జంగారెడ్డిగూడెంలో బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. రాజుల కాలనీలో ప్రధాన నిందితుడితో పాటు మొత్తంగా ఆరుగురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ సుస్మిత వివరాలు వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 2,30,000, 12 సెల్ ఫోన్లు, రెండు లాప్ టాప్‌లు, బ్యాంక్ అకౌంట్లో నగదు సీజ్, ఒక ఐప్యాడ్, బెట్టింగ్‌కు ఉపయోగించే ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను సీజ్ చేశారు.