మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్లో తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’. ఈ సినిమాకు సంబంధించిన OTT డీల్ ఈ వారంలో ఖరారయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డీల్ పూర్తయిన వెంటనే, చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా నటిస్తోంది.