KMM: ఎర్రుపాలెం మండలం మామునూరు రెవిన్యూ పరిధి నరసింహపురం గుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్ లారీలను ఆదివారం మండల తహశీల్దార్ ఉషాశారదా పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టుబడిన టిప్పర్ లారీలను స్థానిక పోలీసులకు అప్పగించినట్లు తహశీల్ధార్ పేర్కొన్నారు.