NLR: కావలి మండలం రుద్రకోట గ్రామంలో బ్రహ్మంగారి విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఏర్పాటు చేసిన సాంప్రదాయ ఎడ్ల బండలాగుడు పోటీలను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి ప్రారంభించారు. ఎద్దుల పట్ల గౌరవం, సంప్రదాయాల కొనసాగింపును అభినందించారు. అనంతరం గ్రామాభివృద్ధికి సిమెంట్ రోడ్లు, చెరువు అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.