మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. రామాయంపేట – ప్రగతి ధర్మారం రహదారిపై చెట్లు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇది గమనించిన రాకేష్, పండు, ఆనంద్, భాను, వేణు, ప్రకాష్, రాజిరెడ్డి తదితరులు శ్రమించి, చెట్లను తొలగించి దారి సుగమం చేశారు. యువత సమయస్ఫూర్తిని స్థానికులు అభినందించారు.