SRCL: రైతే రారాజుగా నిలవాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని వేములవాడ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రొండి రాజు పేర్కొన్నారు. ఆదివారం వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి గ్రామంలో వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు.