HNK: “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యచరణలో భాగంగా వరంగల్-1 డిపో RTC సిబ్బందికి ఇవాళ ఉదయం కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్‌లో 100 మీటర్ల పరుగు పందెం, బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. క్రీడల్లో పాల్గొనాలనుకునేవారు ఉదయం 5:30కి మైదానానికి హాజరుకావాలని సూచించారు.