పెద్దపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పుష్పలత అనే మహిళ స్థానిక శాంతినగర్ కాలనీ వీధి రోడ్డుపై చేపడుతున్న అక్రమ కట్టడాలను తొలగించాలని కలెక్టర్‌కు ఆర్జీ సమర్పించారు. ఇది వరకు ఫిర్యాదులు ఉన్నప్పటికీ చాటు మార్గంగా నిర్మిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మునిసిపల్ కమిషనర్‌కు లేఖ రాస్తూ అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.