MBNR: TGSC స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://www.tsstudycircle.co.in వెబ్ సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని NTR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మార్చి 1న 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.