NRPT: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దామని మరికల్ సీఐ భగవంతు రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలో మంగళవారం ఆయన విగ్రహానికి అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. సర్పంచ్ చెన్నయ్య, అఖిలపక్ష నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ నివాళులర్పిచారు.