నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించింది. తెలంగాణ డీజీపీ నుంచి వారికి మంగళవారం ఆదేశాలు అందాయి. ప్రమోషన్లు పొందిన వారిలో బన్సీలాల్ (పీసీ, మహిళా పోలీస్స్టేషన్ నిజామాబాద్), నాగరాజు (పీసీ, పోలీస్ స్టేషన్ ఆర్మూర్), శ్రావణ్ కుమార్ (పీసీ నందిపేట్ పోలీస్ స్టేషన్) ఉన్నారు.