NZB: నందిపేట మండలం ఐలాపూర్లో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కుస్తీ పోటీలు ఆకట్టుకున్నాయి. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన పైల్వాన్లు తమ బలాబలాలను ప్రదర్శించి తలపడ్డారు. విజేతలకు కమిటీ సభ్యులు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను చూసేందుకు చుట్టుపక్కల మండలాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.