JGL: ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర ఉత్తీర్ణతా శాతం 70%గా ఉండగా, జగిత్యాల జిల్లా ఉత్తీర్ణత శాతం 75%తో ముందంజలో ఉంది. జిల్లాలో ప్రథమ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 56.34%తో 24వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 62.81%తో 13వ స్థానంలో నిలిచింది. అలాగే ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గత ఏడాది 68.73%తో 18వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 74.9%తో 10వ స్థానంలో నిలిచింది.