NRPT: గ్రామాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట మండలం తిరుమలాపూర్ గ్రామంలో ఎంపీ నిధులతో నిర్మించిన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు. అంతకుముందు తిరుమలనాథ స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. రూ. 10 లక్షల వ్యయంతో హాల్ నిర్మించినట్లు చెప్పారు.