MNCL: మందమర్రిలోని యాపల్ ప్రాంతంలో గత నెల 30న సెగ్గం మధు, దుర్గం నాగలక్ష్మి ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడిన జాడి అభిరామ్ ను గురువారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై జి. నరేష్ తెలిపారు. స్థానిక సీఈఆర్ క్లబ్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి 14.4 గ్రాముల బంగారం, 14 తులాల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.