SDPT: సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూర్ గ్రామపంచాయతీలో ప్రజలకు పరిశుభ్రతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశంతో పాటు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరణ, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ప్రజలంతా తడి, పొడి చెత్తను వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందజేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భాగస్వాములై గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.