WGL: వర్ధన్నపేట రానున్న వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని 11వ డివిజన్ కౌన్సిలర్ సిలివేరు కుమారస్వామి యాదవ్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని 11వ డివిజన్లో చెడిపోయిన నీటి బోర్లను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని, గేట్ వాల్వ్‌లను సరిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.