MNCL: ప్రభుత్వ విద్యా సంస్థలు, వసతి గృహాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బెల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలను సందర్శించి వంటశాలలు, మెనూ అమలును పరిశీలించారు. విద్యార్థుల చిత్రలేఖన నైపుణ్యాలను చూసి అభినందించారు. అనంతరం పరిసరాల పరిశుభ్రతపై పలు సూచనలు చేశారు.