BHNG: తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు, ఆస్తి పంచుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నా, తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారు. గతంలో కౌన్సిలింగ్ ఇచ్చినా మార్పు రాకపోవడంతో, బాధితులు నిన్న ప్రజావాణిలో కలెక్టర్కు మొరపెట్టుకున్నారు.