AP: మార్కాపురం జిల్లాలో బస్సు ప్రమాదంపై పలువురు మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, టీజీ భరత్, ఆనం రామనారాయణరెడ్డి, మంత్రి డీఎస్బీవీ స్వామి మృతులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రమాదంపై కలెక్టర్, ఎస్పీతో వారు మాట్లాడారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.