AP: ప్రకాశం జిల్లాలో నిన్న జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పరీక్షను కేవలం ఒక్క విద్యార్థి రాశాడు. జిల్లాలో ఈ సబ్జెక్టును ఎవరూ ఎంచుకోకపోవడంతో పామూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ఈశ్వరరెడ్డి కోసం ఒమీగా కళాశాలను ప్రత్యేక కేంద్రంగా కేటాయించారు. ఒకే అభ్యర్థి కోసం పరీక్షా కేంద్రాన్ని నిర్వహించినట్లు ఆర్ఐవో ఆంజనేయులు పేర్కొన్నారు.