VKB: పరిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ పరశురాం రెడ్డి పంట పిచికారీ డ్రోన్ రైతులకు ఎంతో మేలు చేస్తుందన్నారు. బుధవారం ప్రభుత్వం రాయితీపై మంజూరు చేసిన డ్రోన్‌ను పరిగి వ్యవసాయశాఖ అధికారులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. పంటలకు పురుగుమందులు పిచికారీ సులభంగా అతి తక్కువ సమయంలో చేసుకోవచ్చని చెప్పారు. రైతులు ఈ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు.