ASR: అభా యాప్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆసుపత్రికి వచ్చే రోగులు ఓపీ నమోదు కోసం గంటల తరబడి వేచి ఉండకుండా ‘అభా యాప్’ ద్వారా డిజిటల్‌గా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. దీనివల్ల సమయం ఆదా అవుతుందన్నారు. రోగుల ఆరోగ్య రికార్డులు భద్రంగా ఉంటాయన్నారు. బుధవారం పాడేరు సర్వజన ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు.