నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ప్రారంభమైన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఢిల్లీ 2026’ వేడుకల్లో ఆయనకు ప్రతిష్టాత్మక ‘లైఫ్‌టైమ్ అచీవ్మెంట్’ పురస్కారాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సినిమా రంగానికి ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత్ మండపంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. బాలయ్య అభిమానులు ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.