MDK: వెల్దుర్తి మండలం కుకునూర్ గ్రామ బస్టాప్ వద్ద ఇద్దరు చిన్నారులు ఒంటరిగా కనిపించారు. దీంతో గుర్తుతెలియని ఈ చిన్నారుల గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పిల్లల వివరాలను సేకరిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఇక్కడికి చేరుకున్నారనే అంశాలపై విచారణ చేపట్టారు.