భారతీయ కుటుంబాల వద్ద భారీగా బంగారు నిల్వలు ఉన్నట్లు ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. భారతీయ మహిళల వద్ద సుమారు 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం ఉన్నట్లు సదరు సంస్థ తెలిపింది. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్లో 10 ట్రిలియన్ డాలర్లు(950 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. అలాగే దేశంలోని ప్రధాన ఆలయాల వద్ద సుమారు 3 వేల నుంచి 4500 టన్నుల బంగారం ఉన్నట్లు చెప్పింది.