PPM: సీతానగరం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయంలో ఈనెల 31 నుంచి నవనారసింహ యాగ కార్యక్రమం నిర్వహించబడునని ఆలయ అర్చకులు పీసపాటి శ్రీనివాసాచార్యులు తెలిపారు. ఆలయంలో విశ్వశాంతి, లోక కళ్యాణార్థం, బ్రహ్మోత్సవాలతో పాటు యాగ కార్యక్రమం మార్చి 31 నుంచి ఏప్రిల్ 9వ తేది వరకు 9 రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు.