TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి ఎండల తీవ్రత పెరగనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం తదితర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39-41°C వరకు నమోదు కావొచ్చని వాతావరణ కేంద్రం వెల్లడించింది. HYDలో 38-39°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. అధిక వేడి కారణంగా సాయంత్రం వేళల్లో వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.