TG: DYFI, నిరుద్యోగ JAC నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళనతో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది.