ATP: కనేకల్ మండలంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో పలువురు పార్టీలో చేరారు. కనేకల్, సొల్లాపురం, నాగేపల్లి గ్రామాలకు చెందిన వంశీ, సాయి, హరి విజయ్, కమల, చంద్రకళ, శాంతి సహా పలువురు కార్యకర్తలు బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలే తమను నడిపించాయని వారు పేర్కొన్నారు.