TPT: శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తుల నుంచి డబ్బులు తీసుకుని దర్శనాలు చేయిస్తున్న వారిని విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ గార్డులు గురవమ్మ, విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని దర్శనాలకు పంపుతున్నట్లు కంట్రోల్ రూమ్ నుంచి ఈవో గుర్తించారు. కాంట్రాక్ట్ వర్కర్ విజయ్ కుమార్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పెంచలయ్యను సైతం విధుల నుంచి తొలగించారు.