BHNG: రాజాపేటకు చెందిన ప్రముఖ గాయని పబ్బోజు శోభారాణికి గ్లోబల్ నారీ సేవా శిరోమణి పురస్కారం లభించింది. హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గ్లోబల్ ఫైన్ ఆర్ట్స్ యోగా అకాడమీ ఛైర్మన్ డాక్టర్ మల్లెపూల వెంకటరమణ అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు, రాజకీయ, వ్యాపారవేత్తలు, పాల్గొన్నారు. అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.