SRPT: హుజూర్ నగర్ మండలం బూరుగడ్డ గ్రామంలో శ్రీ శాల్మలీకండ ఆదివరాహ లక్ష్మీనృసింహ వేణుగోపాల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2న జరగనున్న స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.