చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను మార్చకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. PPF(7.1%), సుకన్య సమృద్ధి(8.2%), కిసాన్ వికాస్ పత్ర(7.5%), NSC(7.7%) వంటి పథకాల రేట్లు ఏప్రిల్-జూన్ త్రైమాసికంలోనూ యథాతథంగా కొనసాగనున్నాయి. వరుసగా 8వ సారి రేట్లలో మార్పు చేయలేదు. ప్రతి 3 నెలలకోసారి కేంద్రం ఈ రేట్లను సమీక్షిస్తుంది. ఇంతకు మందు 2023-24లో వీటిని సవరించారు.