PDPL: కమాన్‌పూర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ జబ్బార్ ఖాన్ ‘ఉగాది జాతీయ పురస్కారం’ అందుకున్నారు. గోదావరిఖనిలో తార ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. గత 33 ఏళ్లుగా పాత్రికేయ రంగంలో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, తోటి జర్నలిస్టులు ఆయనను అభినందించారు.