ATP: రాయదుర్గం పట్టణంలోని కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. అడ్వకేట్లు ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కనేకల్ మండలానికి చెందిన హనుమంత రెడ్డి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. నూతన అధ్యక్షుడిని బార్ అసోసియేషన్ సభ్యులు, అడ్వకేట్లు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.