TG: పాతబస్తీ మెట్రో పనుల వల్ల పురాతన కట్టడాలు దెబ్బతింటున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిల్ విచారణలో ఉండగానే కొన్ని కట్టడాలను కూల్చివేస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై సమాధానం ఇచ్చేందుకు, అఫిడవిట్ దాఖలు చేయడానికి మెట్రో నిర్మాణ సంస్థ సమయం కోరింది. దీంతో ధర్మాసనం తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.