GNTR: అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను మరోసారి వంచించేందుకు కొత్త నాటకానికి తెరతీసిందని గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. అమరావతిపై చిత్తశుద్ధి లేదు అమరావతి రాజధాని కాదని వైసీపీ ఎప్పుడూ అనలేదు. కానీ, 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు అక్కడ ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని అన్నారు.