AP: 2047 నాటికి రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు కార్పొరేషన్లో జరిగిన P4 వార్షికోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ‘స్వర్ణాంధ్రప్రదేశ్ 2047’ విజన్లో భాగంగా సంపద, ఆరోగ్యం, ఆనందంతో కూడిన అభివృద్ధిని సాధించడమే P4 లక్ష్యమని ఆయన తెలిపారు.