కామారెడ్డిలో సోమవారం హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి చేసింది. పట్టణంలోని నిజాంసాగర్ చౌరస్తా రోడ్డులో నూతనంగా విశాల షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ హాజరయ్యారు. హీరోయిన్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ప్రజలు పెద్దఎత్తున షాపింగ్ మాల్ వద్దకు చేరుకున్నారు.